Close

DSCDO

షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ, సూర్యాపేట జిల్లా

ప్రగతి నివేదిక

 

          సూర్యాపేట జిల్లా లో గల (30) పాఠశాల వసతి గృహములలో (1876) విద్యార్థినీ, విద్యార్థులకు 2024-25 సంవత్సరంలో ప్రవేశము కల్పించనైనది. వసతి గృహ విద్యార్ధులకు 01-11-2024 నుండి మెస్ ఛార్జీలు ప్రభుత్వం 3 నుండి 7వ తరగతి విద్యార్ధులకు రూ.950/- నుండి రూ. 1330/- లకు నెలకు ఒక విద్యార్ధికి, 8 నుండి 10 వ తరగతి విద్యార్ధులకు రూ. 1100/- నుండి రూ.  1540/-లకు మరియు  ఇంటర్ నుండి పీజీ  వరకు రూ . 1500/- నుండి రూ.  2100/-లకు పెంచడం జరిగినది. మెస్ ఛార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచడం జరిగినది.  వసతి గృహ నిర్వహణకు 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారు రూ.02 కోట్ల 20  లక్షల 41 వేల రూపాయలు ఖర్చు చేయడమైనది. మరియు ప్రభుత్వ వసతి గృహముల మరమ్మతుల కొరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు రూ. 1 కోటి 5 లక్షలు మంజూరి చేయడం జరిగినది. విద్యార్థులకు నోట్ బుక్స్, టవల్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్,  బ్లాంకెట్స్, స్పోర్ట్స్ షూస్, స్కూల్ షూస్, 3జతల సాక్స్, పారగాన్ స్లిప్పర్స్, ట్రంక్ పెట్టెలు, బంకర్ బెడ్స్, 4 జతల దుస్తులు, స్వేట్టర్స్, పరుపులు, దిండ్లు సరఫరా చేయనైనది. జిల్లాలో (6) కళాశాల వసతి గృహాలలో (958) మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించనైనది. వారికీ 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 02 కోట్ల 08  లక్షల 71 వేల రూపాయలు ఖర్చు చేయనైనది. పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనముల క్రింద ఇంటర్మీడియట్ ఆ పై కోర్సులు చదువుచున్న విద్యార్థినీ, విద్యార్థులకు రూ.11  కోట్ల 47  లక్షల 18  వేల నిధులు ఖర్చు చేయనైనది. అదే విధముగా ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల క్రింద పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న 5 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉపకార వేతనాలు రూ.4  లక్షల 9 వేల రూపాయలు మంజూరు చేయబడినది. బెస్ట్ అవైలబుల్ పథకము క్రింద (1012) మంది విద్యార్థిని, విద్యార్థులను రూ. 1 కోటి 77 లక్షల 20 వేలు ఖర్చు చేయడం జరిగినది.  అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకము క్రింద (04) విద్యార్థులకు రూ.  61 లక్షల 25 వేల రూపాయలు మంజూరు చేయనైనది. కులాంతర వివాహ పథకము క్రింద 2024-25ఆర్థిక సంవత్సరంలో 04 జంటలకు 10 లక్షల రూపాయలు ఖర్చు చేయనైనది. కార్పొరేట్ కళాశాలలో ఈ సంవత్సరం (33) విద్యార్థిని, విద్యార్థులకు ప్రవేశము కల్పించడం జరిగినది. సూర్యాపేట జిల్లా కేంద్రములో నడపబడుచున్న టి.జి.యస్.సి స్టడీ సర్కిల్ యందు కోచింగ్ తీసుకున్న వారిలో మొత్తం (74) మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.

                                                                             Common Diet MENU 2025